హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీనగర్, నాగోల్, కాప్రా, మన్సూరాబాద్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, మల్కాజ్‌గిరి, కాప్రా, నాగారం, నేరేడ్‌మెట్ ప్రాంతాలో వర్షం కురిసింది. రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో ఓ మోస్తారు వర్షాలు కురువనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.