అవినీతిని అధికారికం చేస్తున్నారు

అవినీతిని అధికారికం చేస్తున్నారు



న్యూడిల్లీ: 'ఎలక్టోరల్‌ బాండ్స్‌'పై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ అవినీతిని అధికారికం చేసే పరోక్ష, రహస్య విధానం ఇదని కాంగ్రెస్‌ మండిపడింది. ఎలక్టోరల్‌ బాండ్స్‌పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. నల్లధనాన్ని అరికట్టే దిశగా, న్యాయమైన డబ్బు రాజకీయాల్లోకి వచ్చేలా తీసుకొచ్చిన బాండ్స్‌ను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని బీజేపీ ఎదురు దాడి చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎలక్టోరల్‌ బాండ్స్‌ అంశాన్ని కాంగ్రెస్‌ లేవనెత్తింది.